సూర్యాపేటలో భారీ వర్షం
ఆత్మకూరు మండలంలో 19సెంటీవిూటర్లు నమోదు
సూర్యాపేట,జూలై8(జనం సాక్షి)): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్)మండలంలో 19 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. అలాగే తుంగతుర్తిలో 14 సెంటీవిూటర్లు, నడిగూడెంలో 13, మద్దిరాలలో 11, నాగారంలో 9 సెంటీవిూటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయింది. నకిరేకల్ లో 9 సెం.విూ, నల్గొండలో 7, కేతేపల్లిలో 7, శాలిగౌరారంలో 7, తిప్పర్తిలో 6 సెంటీవిూటర్ల చొప్పున వర్షం పాతం నమోదు అయింది. అలాగే యాదాద్రి జిల్లా అడ్డగుడూర్ మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ధర్మారం చెరువు అలుగు పోస్తుండటంతో ధర్మారం ` లక్ష్మిదేవి కాల్వ గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతొ సూర్యాపేట పట్టణంలోని కొన్ని కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. మానస నగర్, స్నేహనగర్ ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో జనం అవస్థలు పడుతున్నారు. వాన నీరు స్వేచ్ఛగా ప్రవహించే అవకాశం లేకుండా.. నాలాలు ఆక్రమించుకొని ఇండ్లు కట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడిరదంటున్నారు. మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. కేవలం ఒక్కసారి భారీ వర్షం పడితే చాలు కాలనీలు నీట మునిగే పరిస్థితి ఉందంటున్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి వరద నీటిని క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలంటున్నారు.