యాక్సిడెంట్‌లో ప్రాణాలు హరీ
హైదారబాద్,జూలై11(జనం సాక్షి): సెల్‌ఫోన్ మాట్లాడుతూ, నిర్లక్ష్యంగా రాంగ్‌రూట్‌లో వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కలోపోయాడు. ఈ ఘటన నగరంలోని పాతబస్తీలో చోటు చేసుకుంది. 35 ఏళ్ల ఖాజా అనే వ్యక్తి తన ద్విచక్రవాహనంపై ఫోన్‌లో మాట్లాడుతూ, రాంగ్ రూట్‌లో రోడ్డు దాటేందుకు యత్నించాడు. ఈక్రమంలో అటువైపు నుంచి వచ్చిన మరో ద్విచక్రవాహనం ఖాజా బైక్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఖాజా తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్దారించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేయరాదని ట్రాఫిక్ పోలీసులు ఎన్నిసార్లు చెప్పిన వాహనాదారులు మాత్రం పెడచెవిన పెడుతూ ప్రాణాల విూదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటనే దీనికి నిదర్శనం. అతను ముందు వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూ రాంగ్‌రూట్‌లో పోవడంతో అటువైపు నుంచి వచ్చిన వ్యక్తికి కనపడక పోవడంతో ఢీకొన్నాడు. దీంతో అతను ప్రాణాల విూదకు తెచ్చుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




