పంటకాలనీల ఏర్పాటుతో రైతులకు లాభం
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై అద్యయనం
హైదరాబాద్,ఫిబ్రవరి8(జనంసాక్షి): పంట కాలనీలను ఏర్పాటు చేసి సేద్యంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని సీఎం పకటించినట్లుగానే రంగంలోకి దిగారు. పంట కాలనీలకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో కదిలిన ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పార్థసారధి పలు సూచనలతో ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగ స్వరూపాన్ని మార్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మూస పద్ధతిలో నడుస్తున్న ప్రస్తుత సేద్యపు విధానాల నుంచి రైతులను ఆధునికం వైపు నడిపించే బృహత్తర పథకానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండిస్తే మార్కెట్లో అడ్డగోలు దోపిడీకి
గురవుతూ తీవ్ర నిరాశలో కూరుకుపోయి చివరకు కాడిని వదిలేసిన వాళ్లు ఎందరో ఉన్నా రు. అందుకే ప్రభుత్వం రైతులు నష్టపోకుండా ఉండేదుకు క్రాప్ కాలనీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. గతేడాది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని అమలు చేశారు. అక్కడ సత్ఫలితాలు రావడంతో రాష్ట్రమంతా అమలుకు నిర్ణయించారు. ఒక ప్రాంతంలో రైతులు ఎక్కువగా పండించే పంటలను సర్వే చేసిన తర్వాత వాటికి అనుబంధంగా ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పక్రియ ఉంటుంది. రైతులు పండించిన పంటను అడ్డగోలుగా కాకుం డా ప్రాసెసింగ్ చేసి అత్యంత నాణ్యతతో డిమాండ్ చోటుకు తరలించి అమ్ముతారు. దీంతో రైతులు అధిక లాభాలు పొందే వీలుంటుంది. ఇందుకోసం
ఎంపిక చేసిన గ్రామాల్లో శిక్షణ కార్యక్రమంలో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. పంట కాలనీల ఏర్పాటుకు సంబంధించి జిల్లాలోని రైతుల వివరాల కోసం సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. దీనికి 39 అంశాలతో కూడిన సర్వే ఫ్రొఫార్మాను వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా హైదరాబాద్లోనే ఉన్నతస్థాయి అధికారులతో రూపొందించారు. ప్రస్తుతం ఈ ప్రొఫార్మా ఫారాలను జిల్లా అవసరాలకు కావాల్సినన్ని స్థానికంగానే ముద్రించే పక్రియ నడుస్తున్నది. ఇది పూర్తి కాగానే జిల్లాలోని అన్ని మండలాల్లో రైతుల సమగ్ర సర్వే ప్రారంభమవుతుంది. ఈ సర్వే పక్రియను జిల్లాలోని ఎంఏవోలు, ఏడీఏలు, జేడీఏ పర్య వేక్షిస్తారు. రెండు నెలల్లో ఈ సర్వే పూర్తి కావాలనే స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో సమగ్ర సర్వే రిపోర్టు ఆధారంగ ఏ ప్రాంతలో ఏ పరిశ్రమలు నెలకొల్పాలనే నిర్ణయం తీసుకుంటారు. పంట కాలనీల కోసం చేపట్టనున్న సర్వే సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు అన్ని వివరాలూ తీసుకుంటారు. సర్వేలో రైతు పట్టాదారు పాసు పుస్తకం నంబరు, బ్యాంకు ఖాతా నంబరు, సామాజక స్థితి, రైతులకు భూమి విస్తీర్ణం, నీటి పారుదల వసతి కూడా సేకరిస్తారు. రైతు భూమి స్వభావంతో పాటు, రైతులు వానాకాలంలో, యాసంగిలో పండించే పంటల వివరాలను కూడా రాసుకుంటారు. మార్కెటింగ్ సౌకర్యాలు, రైతులు తీసుకున్న రుణా లు, పంటకు చేసిన ఇన్సూరెన్స్ వివరాలను సైతం పొందు పరుస్తారు. రైతులకు ఉన్న పశువుల సంఖ్యను, ఆ రైతుకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన ఉందా అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఇక ఈ ప్రాంతంలో ఏ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పితే బా గుంటుందనే అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారు. రైతులు కుటుంబంలో ఉండే స్వయం సహాయక సభ్యుల సభ్యుల వివిరాలు, గ్రూప్ వివరాలను సేకరిస్తారు. డ్వాక్రా సం ఘాల మహిళల భాగస్వామ్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనుండగా, వారి ఆజమాయిషీ లోనే అవి కొనసాగుతాయి. కాగా, కూరగాయల సాగు ప్రధానంగా ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
సేద్యంలో మార్పులకు వ్యవసాయశాఖ సిద్దం




