Thursday, 5 November 2026

సైకో ఆచూకీ కోసం మరిన్ని బృందాలు

తడ: గురువారం తెల్లవారు జామున ప్రయాణికులను హత్యచేసిన సైకోను పట్టుకొనేందుకు ఆరు బృందాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు నెల్లూరు ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. బస్సులో ప్రయాణికుల గ్రామాలకు బృందాలను పంపిస్తున్నట్లు తెలిపారు. ఉన్మాది వూహాచిత్రాన్ని గీసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో సైతం గాలిస్తున్నట్లు చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేస్తున్నామన్నారు. చిత్తూరు ఎస్పీ రాణా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గాలింపు చర్యలు చేపడుతున్నామని, నిందితుల్ని త్వరలోనే గుర్తిస్మాన్నారు. నిందితుడి వేలిముద్రలనుఉ గుర్తించేందుకు సంఘటనా స్థలానికి వెళ్లి మరోసారి బస్సును పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *