హైదరాబాద్: హైటెక్‌సిటీలోని సైబర్ టవర్స్‌లో బాంబు పెట్టామని మరికొద్ది సేపట్లో అది పేలుతుందంటూ కొందరు ఆకతాయిలు చేసిన ఫోన్‌తో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. హుటాహుటిన సైబర్ టవర్స్‌కు చేరుకున్న బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు నిర్వహించి అది ఫేక్ కాల్‌గా నిర్ధారించారు. దీంతో సైబర్‌టవర్స్‌లో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఫోన్ చేసిన వారి కోసం పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
సైబర్ టవర్స్‌కు బాంబు బెదిరింపు




