సొంత ఇల్లు కూడా లేదు :డొక్కా
హైదరాబాద్: డబ్బు దాచుకోవడం, ఆస్తులు కూడ బెట్టుకోవడం తనకు తెలియదని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. నగరంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని, కనీసం సొంతిల్లయినా కట్టు కోలేక పోయానని అన్నారు.