Monday, 2 November 2026

సొంత కరెన్సీ ముద్రిస్తున్న ఐఎస్

fv10q3ufవికృతచేష్టలతో జనాలను అత్యంత కిరాతకంగా హతమారుస్తున్న ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు ఏకంగా సొంత కరెన్సీని తయారు చేయబోతున్నారు. ఈమేరకు బంగారు దినార్‌కు సంబంధించిన వీడియోను ఐఎస్ మీడియా విభాగం అల్ హయత్ ది రిటర్న్ ఆఫ్ గోల్డ్ దినార్ పేరుతో విడుదల చేసింది. తమ బంగారు నాణేల ముద్రణ అమెరికాకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై 9/11 దాడి తర్వాత అతిపెద్ద దెబ్బ అని అభివర్ణించింది. ఈ కొత్త నాణెంపై ఇస్లాం సూక్తులను పొందుపర్చారు. బంగారు, వెండి, రాగి నాణేలను ముద్రించాలని ఐఎస్ నిర్ణయించింది. చమురు క్షేత్రాలు, పన్నులు, దోపిడీలు, కిడ్నాపుల ద్వారా ఐఎస్ రోజూ మూడు మిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయం ఆర్జిస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *