సొసైటీ కార్యాలయంలో సహకార దినోత్సవ వేడుకలు

జూలూరుపాడు, జులై 2, జనంసాక్షి: జూలూరుపాడు సొసైటీ కార్యాలయంలో ప్రపంచ 100వ సహకార దినోత్సవం సందర్భంగా శనివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి సహకార జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. సంఘం అభివృద్ధితో పాటు రైతులకు ప్రభుత్వం ద్వారా సేవలను మరింత విస్తృతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు లాకావత్ హేమ్లా, భూక్యా జవహర్ లాల్, మనుబోలు తిరువెంగళరాజు, పాపిన్ని వెంకయ్య, సిబ్బంది పాల్గొన్నారు