Sunday, 8 November 2026

సోనియాను భ్రమల్లో పెట్టి.. కాంగ్రెస్‌ నేతలు అబద్దాలు చెప్పించారు

 

– సోనియా చెప్పేవి అబద్దాలని తెలిసే కార్యకర్తలే మౌనంగా ఉండిపోయారు

– 11న కూటమి కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయి

– విలేకరుల సమావేశంలో తెరాస ఎంపీ వినోద్‌ కుమార్‌

హైదరాబాద్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి) : సోనియాను భ్రమల్లో పెట్టి కాంగ్రెస్‌ నేతలు అబద్దాలు చెప్పించారని, ఫలితంగా సభలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు సైతం ఇవి అబద్దాలుగా కదా అన్నట్లు మూగబోయారని తెరాస ఎంపీ వినోద్‌ అన్నారు. శనివారం ఆయన తెరాస భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సోనియా గాంధీ మొదటగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతల తీరును మార్చాలని అన్నారు. దేశంలో తెలంగాణ అన్ని రాష్ట్రాల కన్నా ముందుందని, తెలంగాణ అనేక అవార్డులు, రివార్డులు సాధించిందన్నారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్‌ మంత్రులు తెలంగాణకు వచ్చి ప్రభుత్వ తీరును కొనియాడారని, సోనియగాంధీకి ఇవన్నీ తెలియవా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఆమరణ దీక్ష తర్వాతే తెలంగాణ ఇస్తామన్న ప్రకటన సోనియా చేశారన్నారు. తెలంగాణ ఏర్పాటు ఆలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని, ఆత్మహత్యలకు కాంగ్రెస్‌, టీడీపీలు కారణమని కోదండరామ్‌ తెలియదా అని వినోద్‌ ప్రశ్నించారు. డిసెంబర్‌ 11న సోనియా సహా కూటమి నేతల

కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయని, తెలంగాణ అంటే ఏమిటో డిసెంబర్‌ 11న తెలుస్తుందని వినోద్‌ అన్నారు. సోనియా చెబుతోంది అబద్ధం కాబట్టే కార్యకర్తలు కూడా స్పందించలేదన్నారు. దేశంలో 18పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రభాగాన ఉందని, రాహుల్‌ ప్రసంగం విన్న తర్వాత తలను దేంతో కొట్టుకోవాలో తెలియలేదన్నారు. అంబేడ్కర్‌ పేరు ప్రాణహితకు యథావిథిగా కొనసాగుతోందని, భూసేకరణ ఉమ్మడి జాబితాలో ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం కర్ణాటక కూడా భూసేకరణ చట్టాన్ని సవరించిందని, తెలంగాణ తనకున్న హక్కు మేరకే భూ సేకరణ చట్టాన్ని సవరించిందన్నారు. ప్రత్యేక ¬దా అంటే ఏమిటో కాంగ్రెస్‌ నిర్వచనం చెప్పాలని అన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక ¬దాను ఎవరూ ఇవ్వలేరని, ఏపీకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని, ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్‌ ¬దా ఇస్తానంటోందని అన్నారు.