– ఫలితాలు వచ్చిన ఐదు గంటల్లోనే పొత్తులు కుదుర్చుకుంటారు
– మోదీని ఇబ్బంది పెట్టేందుకు బాబు, కేసీఆర్ ప్లాన్
– అవినీతి రహిత పాలన కావాలంటే బీజేపీతోనే సాధ్యం
– విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
హైదరాబాద్‌న, నవంబర్26(జనంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ లాలూచీని తెలంగాణ ప్రజలు గమనించాలని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు కోరారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విూడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.. తెలంగాణ ఎన్నికల వేళ సోనియాగాంధీ, కేసీఆర్ పరస్పరం పల్లెత్తు మాట కూడా అనుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పుడు జగన్నాటకం కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ఇవన్నీ కుటుంబ పార్టీలేననీ, వీటి మధ్య లాలూచీ సులభంగా కుదురుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో తల్లీ-కొడుకుల రాజ్యం నడుస్తుంటే, టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందని ఎద్దేవా చేశారు. పారదర్శక, అవినీతి రహిత పాలన, అభివృద్ధి కోసం తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ఎన్నికలు పూర్తయిన ఐదు గంటల్లోనే ఈ అవినీతి రాజకీయ పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటాయని జోస్యం చెప్పారు. కేసీఆర్, చంద్రబాబు మధ్య జరుగుతున్న యుద్ధం ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే ముగిసిపోతుందని విమర్శించారు. ప్రధాని మోదీని ఇబ్బంది పెట్టేందుకు చంద్రబాబు, కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. సోనియా, రాహుల్ పట్ల కేసీఆర్‌కు చాలా ఆప్యాయత ఉందనీ, అందుకే కాంగ్రెస్ చేసిన అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా రాకుండా కాంగ్రెస్ పార్టీనే కుట్ర చేసిందని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వడంపై 2013లో అప్పటి రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ నేతృత్వంలో ఓ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక¬దా ఇవ్వడం ఆమోదనీయం కాదని రఘురాం రాజన్ సెప్టెంబర్ 23న నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు. దీని ఆధారంగానే ప్రత్యేక¬దా డిమాండ్ ను నిర్వీర్యం
చేయాలన్న కుట్రకు కాంగ్రెస్ తెరతీసిందన్నారు. ఇప్పుడు ఆంధ్రులను మోసం చేసేందుకు సీఎం చంద్రబాబు, సోనియా గాంధీ మరోసారి చేతులు కలుపుతున్నారని ఆరోపించారు. రఘురాం రాజన్ ద్వారా ప్రత్యేక ¬దాకు శఠగోపం పెట్టించారనీ, ఆంధ్రులను మోసం చేస్తూ దొంగనాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక ¬దా అంటే ఏమిటి? ఏయే ప్రయోజనాలు చేకూరుస్తారు? అనే విషయాలపై రాహుల్ ఈ నెల 28న ఖమ్మం బహిరంగ సభలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక ¬దాను కర్ణాటక ప్రభుత్వంతో పాటు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత వీరప్ప మొయిలీ వ్యతిరేకిస్తున్నారని జీవీఎల్ గుర్తుచేశారు. అలాంటప్పుడు ఏపీకి ప్రత్యేక ¬దా ఏ రకంగా సాధ్యమని ప్రశ్నించారు. ఏపీ పునర్విభజన చట్టంలో లేకపోయినా రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయం చేసిందనీ, అన్నిరకాలుగా ఆదుకుందని జీవీఎల్ తెలిపారు.




