సోనియా రుణం తీర్చుకుందాం

బచ్చన్నపేట మే 11 ( జనం సాక్షి)

అందరికీ సంక్షేమ పథకాలు
జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి

తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైనదని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మురి ప్రతాప్ రెడ్డి అన్నారు శనివారం బచ్చన్నపేట మండలంలో బోనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈనెల 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో దేశం మనుగడ కోసం. దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బిజెపి. టిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని అన్నారు. బిజెపికి ఓటు వేస్తే మన గోతిని మనమే తీసుకున్న వారి మౌతామని అన్నారు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసివేస్తామని అంటున్నారని కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు న్యాయం చేసే పార్టీ అని తెలిపారు. అందరికీ సంక్షేమ పథకాలు కావాలంటే కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని అందుకే భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బచ్చన్నపేట మండల అధ్యక్షులు నూకల బాల్ రెడ్డి. నల్లగొని బాలకిషన్ గౌడ్. అల్వాల ఎల్లయ్య. కోడూరి మహాత్మ చారి. జంగిటివిద్యనాథ్. గంగరబోయిన మహేందర్. దిడ్డిగ రమేష్. దాచేపల్లి రాజయ్య. ఈదులకంటి వెంకట్ రెడ్డి. సందెల రాము. గిద్దెల రమేష్. అలవాల రమేష్. కర్రె నరేష్. గోలి బుచ్చిరాజు వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు ఉన్నారు