Saturday, 7 November 2026

సోనియా వల్లనే తెలంగాణ ఏర్పాటు

ఆమె రాకకోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు: ఉత్తమ్‌

హైదరాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): సోనియా వల్లే తెలంగాణ సాకారమైందని టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు.

తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్‌ సందేశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోందని చెప్పారు. బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీపై ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రజలు బొంద పెట్టబోతున్నారని జోస్యం చెప్పారు. బందిపోటు దొంగల్లా కేసీఆర్‌, కేటీఆర్‌ దోచుకున్నారని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. కూటమిని చూసి కేసీఆర్‌ ఎందుకు భయపడుతున్నారన్నారు. ముస్లిం యువకులను ఎన్‌కౌంటర్‌ చేస్తే ఒవైసీ ఎందుకు మద్దతు ఇస్తున్నాడని ప్రశ్నించారు. కేసీఆర్‌కు అసదుద్దీన్‌ ఎంతకు అమ్ముడుపోయాడో చెప్పాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.