టాయ్‌లెట్ నీళ్లు వాడిన వ్యాపారికి లక్ష జరిమానా
హైదరాబాద్,మే3(జనం సాక్షి): టాయ్‌లెట్ నీళ్లతో రైల్వేలో టీ అమ్మకం పేరుతో సోషల్ విూడియాలో హల్చల్ చేసిన వార్తపై దక్షిణమధ్య రైల్వే స్పందించింది. రైల్వే టీ వ్యాపారి రైలు టాయిలెట్ లో నీటిని నింపి టీ క్యాన్లను బయటకు తెస్తున్న వీడియో ఇటీవల సోషల్‌విూడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన 2017 డిసెంబర్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వెలుగుచూసింది. ఆహారం నాణ్యత విషయంలో ఉన్నత ప్రమాణాలు పాటించాల్సిన రైలులో..టీ వ్యాపారులు ఇలా నిర్లక్ష్యం వ్యవహరించడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన సదరు టీ వర్తకుడికి రైల్వే అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు . ఓ టీ వ్యాపారి టాయిలెట్‌లో ఉండగా..మరో వ్యక్తి టాయిలెట్ బయట అతని కోసం ఎదురుచూస్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత టాయిలెట్‌లో ఉన్న వ్యక్తి..డోర్ తీసి అందులో నుంచి టీ, కాఫీ క్యాన్లను ఒక్కోటి బయటకు తీస్తుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్‌విూడియాలో
షేర్ చేయగా..అది కాస్తా వైరల్ అయింది. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.
—–
సోషల్‌విూడియా వార్తకు రైల్వే శాఖ స్పందన




