Tuesday, 3 November 2026

స్కూలు బస్సులు ప్రమాద రహిత నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలి
బస్సుల్లో రక్షకులను నియించాలి
పోలీసుల సూచనలు
హైదరాబాద్‌,మే31(జ‌నం సాక్షి): నేటినుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతుండటంతో పాఠశాల యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులతో పాటు వివిధ జిల్లాల పోలీస్‌ యంత్రాంగం ఆదేశించింది. ఎండలు ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో తల్లిదండ్రులు కూడా ముందుజాగ్రత్తలతో పిల్లలను స్కూళ్లకు పంపాలని సూచించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు సైబరాబాద్‌, రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు పిల్లలు క్షేమంగా స్కూళ్లుకు వెళ్లి ఇళ్లకు చేరేలా అప్రమత్తమవుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలో టాఫిక్‌ రద్దీని నివారించేందుకు ప్రణాళికలను రూపొందించారు. పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్‌ వాహనాల డ్రైవర్లుకు ప్రత్యేక సూచనలను తయారు చేశారు. తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించి వారి సురక్షితమైన ప్రయాణం కోసం సరైన మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. నిబంధనలను పాటించని వారిపై ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాలని  సూచించారు. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే సమయంలో కచ్చితంగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలన్నారు.
సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌ చేయొద్దని, హెల్మెట్‌ ధరించాలని, ట్రిపుల్‌ రైడింగ్‌కు వెళ్లడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం చేయవద్దని ట్రాఫిక్‌ పోలీసులు తల్లిదండ్రులను కోరుతున్నారు.అదే విధంగా పాఠశాలల పిల్లలను తీసుకొని వెళ్లే వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడిపితే వారి గురించి  పోలీసులకు  సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇకపోతే  స్కూల్‌ బస్సులు, ఆటోలు పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లొద్దన్నారు.  ప్రతి స్కూల్‌ బస్సులో ప్రాథమిక వైద్య చికిత్స కిట్‌ ఉండాలి.  స్కూల్‌ బస్సుల కిటికీలకు అడ్డంగా ఇనుప రాడ్లను బిగించుకోవాలి. స్కూల్‌ బస్సులలో అగ్నిమాపక పరికరాలు ఉండాలి.  ప్రతి బస్సుపై పాఠశాల పేరు, ఫోన్‌ నంబర్‌లను నమోదు చేసుకోవాలి.  స్కూల్‌ బస్సు డోర్‌లకు సరైన విధంగా లాకింగ్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి.  స్కూల్‌ బస్సు డ్రైవర్‌కు కనీసం 5 సంవత్సరాల అనుభవం డ్రైవింగ్‌లో ఉండాలి. కంటి చూపి సరిగాఉండాలి. డ్రైవర్‌ విూద ట్రాఫిక్‌ ఉల్లంఘనల చేసిన కేసులు ఉండొద్దు.  విద్యార్థులకు సీటు కింద బ్యాగులు పెట్టుకొనే విధంగా స్థలం కేటాయించాలి.  స్కూల్‌ బస్సులలో పాఠశాల యాజమాన్యం నుంచి సిబ్బంది ఎస్కార్ట్‌గా వెళ్లాలి.  స్కూల్‌ బస్సులు వచ్చే సమయంలో ఇంట్లోని చిన్నపిల్లలు రోడ్లవిూదకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.  బస్సులలో విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిలబడకుండా నిరోధించాలి.  విద్యార్థులు రన్నింగ్‌ బస్సుల నుంచి దిగకుండా కట్టడి చేయాలి. ఆటోలో ప్రయాణించే విద్యార్థులు వారి బ్యాగులను బయటికి వేలాడే విధంగా వేయొద్దు. ఇది ఇతర వాహనదారులను ప్రమాదానికి గురి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆటోలలో 6 గురుకి మించి విద్యార్థులను తీసుకువెళ్లొద్దు.  ద్విచక్ర వాహనాలపై తల్లిదండ్రులు ఇద్దరికి మించివిద్యార్థులను తీసుకు వెళ్లొద్దు.కొన్ని సందర్భాల్లో విద్యార్థులు నిద్రలోకి -జారుకుని వాహనాలపై నుంచి జారిపడిన సంఘటనలు పోలీసు రికార్డులో నమోదయ్యాయి.  ట్రాఫిక్‌ నిబంధనలను పాటించి విద్యార్థులకు సురక్షితమైన ప్రయాణ వాతావరణాన్ని కల్పించాలన్నారు.  ట్రాఫిక్‌ నిబంధనలను పాటించని స్కూల్‌ బస్సులు,యాజమాన్యాలపై వాట్సాప్‌ నెం.9490617111కుసమాచారం అందించాలన్నారు.