స్కూల్ బస్సు లను ఫిట్ నెస్ చేయించుకోవాలి

జిల్లా రవాణా అధికారి
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
 విద్యాసంవత్సరం ప్రారంభమైనందున జిల్లాలో గల అన్ని పాఠశాలలకు చెందిన బస్సులను విధిగా ఫిట్నెస్ చేయించుకోవాలని జిల్లా రవాణా అధికారి  ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 851 స్కూల్ బస్సులకు గాను ఇప్పటివరకు కేవలం 300 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేయించుకున్నారని మిగతా బస్సు లకు కూడా వేంటనే ఫిట్ నెస్ చేయించుకోవాలని. లేని పక్షం లో తమ శాఖ తనిఖీలు నిర్వహించే సమయం లో ఫిట్ నెస్ లేని వాహనాలు జప్తు చేయబడతాయని తెలిపారు. అదే విధంగా జిల్లా ప్రజలు తమ వాహన సంబందించిన పనుల నిమిత్తం నేరుగా కాని ఆన్లైన్ లో గాని సంస్థ వెబ్ సైట్ లో సంప్రదించాలని కోరారు.కార్యాలయం తో పని లేకుండా టీ యాప్ ను వినియోగించుకోవచన్నారు