హైదరాబాద్: ‘స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్’.. మంచి కార్యక్రమం అని జిహెచ్ ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ అన్నారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా డిజైన్ చేశారని తెలిపారు. 36 వేల మంది అధికారులు ప్రత్యక్షంగా పాల్గొంటారని పేర్కొన్నారు. 1 కోటి ప్రజలు పాల్గోనున్నారని తెలిపారు. స్థానిక టీమ్ కు చాలా ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ప్రతి యూనిట్ ను డివైడ్ చేశామని చెప్పారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించి.. మ్యాప్ కూడా ఇచ్చామని వెల్లడించారు. హరితహారం కోసం.. ఒక ఫార్మెట్ ఇచ్చామని తెలిపారు. 623 వాహనాలతోపాటు అవి.. రిపేర్ అయితే వాటి స్థానంలో వెళ్లేందుకు గానూ.. అదనంగా మరో 400 వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 34 జెసిబిలను సమకూర్చినట్లు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్.. ఒక ఉద్యమం లాగా ఉందన్నారు. మే 6న ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, మంత్రులు, ఉన్నతాధికారులతోపాటు పలువురు పాల్గొన్నారు.స్చచ్ఛ హైదరాబాద్.. మంచి కార్యక్రమం: సోమేష్ కుమార్..




