స్టాక్ మార్కెట్లోకి పెన్షన్‌ నిధులు!

yv7tpxh1భారీ మొత్తంలో ఉద్యోగుల పెన్షన్‌ నిధులను స్టాక్‌ మార్కెట్లలో పనంగా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే ఉద్యోగుల భవిష్య నిధి (ఇపిఎఫ్‌)ని కొంత మార్కెట్లకు తరలించింది. వరుసగా పడిపోతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మద్దతు ఇవ్వడానికి తాజాగా ప్రభుత్వం ఈ నిధులను గుమ్మరించే పనిలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు స్టాక్‌ మార్కెట్లలో 15 శాతం పెన్షన్‌ నిధులను పెట్టడానికి ఆమోదం ఉంది. దీన్ని 50 శాతానికి పెంచాలనే యోచనలో ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదే విషయాన్ని పెన్షన్‌ ఫండ్‌ రెగ్యూలేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) హెడ్‌ హేమంత్‌ కాంట్రాక్టొర్‌ రారుటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.