Monday, 2 November 2026

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మరో రెండుమూడు రోజుల్లో..

snqafp5oప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం అనుమతించిన 3,783 కొలువుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వేగం పుంజుకుంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు, మరో అనుబంధ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన కమిషన్, మరిన్ని కొలువుల భర్తీకి ప్రకటనలు విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మరో రెండుమూడు రోజుల్లో వ్యవసాయశాఖలోని వ్యవసాయ, సహకార కమిషనర్ ఆండ్ డైరెక్టర్, అగ్రికల్చర్ పరిధిలోగల 120 అగ్రికల్చర్ ఆఫీసర్ ఖాళీలు, 311 అగ్రికల్చర్ ఎక్స్‌టెక్షన్ ఆఫీసర్ గ్రేడ్-2, కమిషనర్ ఆఫ్ హార్టీకల్చర్‌లోగల 75 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయనుంది. దీంతోపాటు వాటర్ వర్క్స్‌లోని ఖాళీల భర్తీకి వచ్చేనెల మూడు లేదా నాలుగో తేదీల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *