Tuesday, 3 November 2026

స్త్రీని భోగవస్తువుగా చూసినంత కాలం ఇంతే

 

తాజా ఘటనల నేపథ్యంలో ఆందోళనలు

వివక్షకు తావు లేని విధంగా ప్రవర్తించాలి

న్యాయానికి దళితులు దూరం కాదని చెప్పాలి

హైదరాబాద్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): స్త్రీని భోగ వస్తువుగా చూసే మనస్తత్వం ఇంకా మన సమజాం నుంచి దూరం కాలేదు. స్త్రీ ఏ కులానికి చెందినదన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఆమెను గౌరవించ గలిగే మానవత్వాన్ని సమాజం అలవర్చుకోవాలి. అప్పుడే అత్యాచార ఘటనలు ఆగగలవు. ఇక న్యాయం విషయంలో కులమతాలకు అతీతంగా చర్యలు ఉండాలి. అప్పుడే సమాజంలో ఇలాంటి ఆందోళనలు రావు. దిశపై అత్యాచారం జరగడానికి మూడు రోజుల ముందు అసిఫాబాద్‌ జిల్లాలో ఒక ముప్పయ్యేళ్ల వివాహిత, దళిత యువతిపై కూడా గ్యాంగ్‌రేప్‌ జరిగింది. పరమ కిరాతకంగా ఆ యువతి చేతివేళ్లను, గొంతునూ కోసి చంపి, అడవిలో శవాన్ని పారేశారు. పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ ఘటనకు విూడియాలో పెద్దగా ప్రాధాన్యత లభించలేదు. దిశ కేసులో చెప్పినట్టు, బాధిత మహిళ పేరు గోప్యంగా ఉంచాలని విూడియాకు ఈ యువతి కేసులో ఏ అధికారి సలహా ఇవ్వలేదు. ఇకపోతే దిశ ఎన్‌కౌంటర్‌తో మరోమూడు నాలుగు కేసుల్లో కూడా బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఇక్కడ బాధితులంతా ఇతర అట్టడుగు వర్గాలకు చెందిన వారు. కులాలను బట్టి న్యాయం ఉంటుందా అని ప్రశ్నిస్తున్న వారికి ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. హత్యాచారాలు, లైంగిక దాడులకు గురైన బాధితులు అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తులని తెలిస్తే ఒక లాగా.. బడుగువర్గాలవారు, పేదవారని తెలిస్తే మరోలాగా న్యాయం జరుగుతోందని ఎమ్మార్పీఎస్‌ నేత మందకృష్ణ మాదిగ ఆ వేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళా కుటుంబాల సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై హత్యలు, హత్యాచారాలు జరుగుతున్నా బాధిత కుటుంబాలకు న్యాయం జరగడంలేదని, ఈ ఘటనలపై ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని మందకృష్ణమాదిగ డిమాండ్‌ చేశారు. గత నెల 24న ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ మహిళ పై సామూహిక హత్యాచారం చేశారు. అదేనెల 27న వరంగల్‌లో ఓ అమ్మాయిని ప్రేమించిన వాడే హత్యాచారం చేశాడు. అదే రోజు చటాన్‌పల్లిలో దిశపై దారుణంగా హత్యాచారం చేశారు. పై రెండు ఘటనల్లో నిందితులకు బాధితురాళ్లది ఏ కులమో తెలుసని, దిశ కేసులో మాత్రం నిందితులకు ఆమె కులం పేరు తెలియదని మందకృష్ణ మాదిగ చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో దిశ ఉదంతం దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నది. హైదరాబాద్‌ నగరం శివారు ప్రాంతంలో, దేశంలోనే అతిపెద్ద జాతీయ రహ దారి పక్కన, నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఔటర్‌ రింగ్‌రోడ్డుకు చేరువలో ఒక యువ డాక్టర్‌పై జరిగిన దారుణ ఘటన విూడియాలో విస్తృతంగా ప్రచార మైంది. నాకు భయమేస్తున్నది పాప అన్న దిశ గొంతుక ప్రతి గుండెను తాకింది. ప్రభుత్వంపై, పోలీసులపై ఒత్తిడి పెంచింది. పోలీసులే తీర్పు చెప్పేసి శిక్షలు వేస్తూ పోతే ఇక న్యాయవ్యవస్థ దేనికి? కోర్టులు ? జడ్జీలు ఎందుకు? అంటూ అక్కడక్కడా కొన్ని స్వరాలు వినిపించాయి. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం పోలీసు తీర్పునే సమర్థించారు. ఇదే విషయాన్ని మందకృష్ణ మాటల్లో కూడా స్ఫురించింది. ఈ కారణాలు కూడా నేర పరిశోధనకు సవాల్‌ విసురుతున్నాయి. అనేక కేసుల్లో నేర నిరూపణలో వైఫల్యాలకు ఇవి కూడా కారణాలుగా చూడాలి. మా మాన ప్రాణాలకు విలువ లేదా అని ప్రశ్నిస్తూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ అత్యాచార ఘటనలో నిందితులు బడాబాబులు. ఘోరం జరిగి సరిగ్గా ఏడాది నిండగానే ఆ బాధితురాలిని బడాబాబులు నడిరోడ్డుపై నిప్పుపెట్టి చంపేశారు. ఇక్కడ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన రోజే అక్కడ బాధితురాలి హత్య జరగడం కేవలం యాదృచ్ఛికమే కావచ్చు. ఆడపిల్లల విూద అత్యాచార ఘటనలను సంపూర్ణంగా అరికట్టాలంటే చేపట్టవలసిన చర్యలు ఆలోచించాలనే డిమాండ్‌ ఉంది. ఇటువంటి సంఘటనలు జరిగి నప్పుడు అందరూ చెబుతున్నట్టు విచ్చలవిడి మద్యం విక్రయాలపై నియంత్రణ విధించాలన్న డిమాండ్‌ కూడా వచ్చింది. మొబైల్‌ ఫోన్లలో అశ్లీల వరద ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ ఉంది. బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌ స్వయంగా దీనిని అంగీకరించారు. అభ్యుదయ వాదులమని చెప్పుకునే వాళ్లు కూడా స్త్రీలపట్ల కొంత నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తూనే ఉన్నారు.