Monday, 2 November 2026

స్థానికత ఆధారంగానే విభజన జరగాలి

3nuwnx9rస్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలని, జిల్లాస్థాయిలో ఉద్యోగుల విభజన కమిటీలు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్‌చేశారు. ఢిల్లీలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని, స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగకపోతే రాష్ట్రం ఏర్పడినా న్యాయం జరిగినట్లు కాదని అన్నారు. జిల్లాస్థాయి, మల్టీ జోనల్ ఉద్యోగుల విభజనకు ప్రత్యేకంగా కమిటీలను వేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీల ఏర్పాటుపై సానుకూలంగా స్పందించడంలేదని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ అధికారులకు, డీవోపీటీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని చెప్పామని, మరోమారు ఢిల్లీకి ఉద్యోగ సంఘాల ప్రతినిధులంతా వచ్చి తగిన న్యాయం కోసం ఒత్తిడి చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *