Tuesday, 3 November 2026

స్నూకర్‌ క్రీడాకారుడు ఎన్జూన్‌ కింగ్‌ కన్నుమూత

సికింద్రాబాద్‌: క్రీడారంగ ప్రముఖుడు, బిలియర్డ్స్‌, స్నూకర్‌ జాతీయ క్రీడాకారుడు ఎన్జూన్‌ యషావో కింగ్‌ శనివారం సికింద్రబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 61ఏళ్లు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చాలాకాలం రాష్ట్ర జట్లు తరపున స్నూకర్‌, బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కింగ్‌ పాల్గొని తన సత్తా చాటారు. ఆయన పూర్వీకులు చైనా నుంచి ఇక్కడికి వలసవచ్చి స్థిరపడ్డారు. కింగ్‌ మృతికి దక్కన్‌ క్లబ్‌ మాజీ అధ్యక్షుడు ఎంపీ రవీంద్రనాథ్‌ పాటు పలువురు ప్రముఖులు, క్రీడాకారులు సంతాపం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *