Monday, 2 November 2026

స్పందించిన సాహిత్య నోబెల్ విజేత

స్టాక్‌హోమ్ : సాహిత నోబెల్ గెలుచుకున్న అమెరికా జాన‌ప‌ద ర‌చ‌యిత బాబ్ డిలాన్ ఆ అవార్డు ప్ర‌క‌ట‌న‌పై తొలిసారి స్పందించారు. నోబెల్ అకాడ‌మీ ప్ర‌క‌ట‌న‌తో త‌న‌కు మాట‌లు రాలేద‌ని అన్నారు. స్విడ‌న్ నోబెల్ క‌మిటీకి ఫోన్ చేసిన డిలాన్ త‌న‌ను గౌర‌వించినందుకు అభినందిస్తున్న‌ట్లు తెలిపారు. అమెరికా జాన‌ప‌డ సాహిత్యానికి చేసిన సేవ‌ల‌కు గాను నోబెల్‌ క‌మిటీ డిలాన్‌కు సాహిత్య అవార్డును ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 13న ప్ర‌క‌ట‌న జ‌రిగినా దానిపై ఇంత వర‌కు డిలాన్ స్పందింలేదు. దాంతో ఆయ‌న వ్య‌వ‌హారంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. డిసెంబ‌ర్‌లో జ‌రిగిన అవార్డు స్వీక‌ర‌ణ వేడుక‌కు డిలాన్ వ‌స్తాడో రాడో అన్న సందేహం కూడా ఉండేది. అయితే నోబెల్ బ‌హుమ‌తిపై తొలిసారి మాట్లాడిన ఆయ‌న ఆ అవార్డును అందుకునేందుకు రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌న్నారు. bdylan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *