– 26 నుంచి 28 వరకు కేసీఆర్ విస్తృత పర్యటనలు
– 21 బహిరంగ సభల్లో ప్రసంగించనున్న కేసీఆర్
హైదరాబాద్, నవంబర్22(జనంసాక్షి) : రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదుపరి ఎన్నికల ప్రచార షెడ్యూల్ గురువారం విడుదలైంది. సీఎం కేసీఆర్ ఈ నెల 26 నుండి పాల్గొనే మరో 21బహిరంగ సభల ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఇప్పటికే మలివిడత ప్రచారంలో భాగంగా కేసీఆర్ విసృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే మెదక్, మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లోని పలు నియోకవర్గాల్లో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈనెల 25 వరకు రోజులకు నాలుగు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే కేసీఆర్ 26వ తేదీ నుంచి పర్యటించే షెడ్యూల్‌ను ఆ పార్టీ అధిష్టానం విడుదల చేసింది. 26 నుంచి 28వ తేదీ వరకు కేసీఆర్ నియోజకవర్గాల్లో విస్తృత పర్యటన చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం 26వ తేదిన ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో, 11:45కు నిజామాబాద్ రూరల్లో, మధ్యాహ్నం 12:30కు బోధన్, 1:15 మోర్తాడు (బాల్కొండ నియోజకవర్గం)లో సభలో పాల్గొంటారు. అదేవిధంగా మధ్యాహ్నం 2గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభలో పాల్గొంటారు. 2:45కు కరీంనగర్ లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభ, 3:30కు స్టేషన్ ఘన్ పూర్, 4:15 కు పర్కాల,
సాయంత్రం 5గంటలకు వరంగల్ లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల ఉమ్మడి సభలో పాల్గొంటారు. అంతేకాక 27వ తేదీన ఉదయం 11గంటలకు కల్వకుర్తి, 11:45కు మహబూబ్ నగర్, మధ్యాహ్నం 12:30కు వనపర్తి, 1:15కు కొల్లాపూర్, 2గంటలకు అచ్చంపేటలలో పర్యటిస్తారు.
అదేవిధంగా 2:45కు హాలియా (నాగార్జునసాగర్), 3:30కు మునుగోడు, 4:15కు ఆలేరులో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 28వ ఉదయం 11గంటలకు బాన్సువాడ, 11:45కు జుక్కల్, మధ్యాహ్నం 12:30కు నారాయణఖేడ్, 1:15కు జహీరాబాద్, 2గంటలకు సంగారెడ్డి, 2:45కు ఆందోల్, 3:30కు నర్సాపూర్, 4:15 గజ్వేల్లలో పర్యటించే కేసీఆర్ ఆయాప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గోనున్నారు.




