హంద్రీనీవా అక్రమ ప్రాజెక్టు
` అనుమతి లేకుండానే నీళ్లు ఎత్తుకెళ్తున్నారు
` కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ
హైదరాబాద్,నవంబరు 15(జనంసాక్షి):కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుపై తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు చేసింది. ఎలాంటి అనుమతుల్లేకుండానే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విస్తరణ పనులకు టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొన్నది. విస్తరణ పనుల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.