హనుమకొండలో ఈ నెల 26న జరగనున్న రాజ్యాధికార బహిరంగ సభను విజయవంతం చేయండి.

జైనథ్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద హనుమకొండ లో ఈ నెల 26న జరగనున్న రాజ్యాధికార బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుండి హాజరై దొరల తెలంగాణను బహుజన తెలంగాణగా మార్చుకోవాలని జిల్లా అధ్యక్షుడు గడుగు మహేందర్ అన్నారు బహిరంగ సభ కరపత్రాన్ని బస్టాండ్ వద్ద ఆవిష్కరించారు . బహుజన రాజ్యాధికార యాత్ర బహుజన రథసారధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈనెల 26 తో 100 రోజులు పూర్తి కాబోతున్న సందర్భంగా  హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది అని గడుగు మహేందర్ అన్నాడు.. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మ్యాన సురేష్. జైనథ్ మండల కన్వీనర్ రావుల పోచ్చాన్న, మరియు నాయకులు శ్రీకాంత్, కోవా నరేష్ , మల్లెపల్లి అడేళ్లు, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు