స్కూళ్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి
కడియం శ్రీహరి పిలుపు
హైదరాబాద్,జూన్ 5(జనం సాక్షి): ఈ ఏడాది రాష్ట్ర హరితహారంలో భాగంగా పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులను పత్రికా ప్రకటనలో కోరారు. తెలంగాణ పాఠశాలలను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేసే సంకల్పంతో తెలంగాణ విద్యాశాఖ పనిచేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది వర్షాలు కూడా మంచిగా పడుతాయన్న వాతావరణ శాఖ సమాచారంతో పెద్దఎత్తున పాఠశాలల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలన్నారు. విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించడం, మొక్కల పరిరక్షణ బాధ్యతను వారికి అప్పగించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీసుకోవాలన్నారు. గ్రీన్ బ్రిగేడ్ లను ఏర్పాటు చేసి నాటిన మొక్కలు వందశాతం పరిరక్షించాలన్నారు. చిన్నారుల్లో ఇప్పటినుంచే మొకర్కల పెంపకంపై అవగాహన కలిగించాలని టీచర్లకు సూచించారు. దీంతో వారు సమాజంలో మొక్కల పెంపకం పట్ట నిబద్దత కలిగి ఉంటారని అన్నారు.




