ఇచ్చిన హావిూలు నెరవేరుస్తున్న ఘనత బాబుదే: టిడిపి
కర్నూలు,జూన్5(జనం సాక్షి): రాష్ట్ర విభజన జరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని టిడిపి జిల్లా నాయకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. 2014లో ఇచ్చిన హావిూ ప్రకారం నెలకు రూ.1000 నిరుద్యోగ భృతిని ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. దీంతో పాటు ఉద్యోగాల కల్పనకు కర్నూలు జిల్లాలో సోలార్ పరిశ్రమ, విమానాశ్రయం, పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాయలసీమ అంటేనే గుర్తుకు వచ్చేది కరవని, అలాంటి పరిస్థితుల్లో రైతులు నేడు రెండు పంటలు పండిస్తున్నారంటే ముఖ్యమంత్రి చలువే అన్నారు. పట్టిసీమ జలాలను రాయలసీమకు తీసుకువచ్చి రైతులకు సాగు జలాలు అందిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని వేలెత్తి చూపే అర్హత ఏ పార్టీకి లేదన్నారు. ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లే ఏకైక పార్టీ తెదేపా అని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల్లో నాయకులను భాగస్వామ్యం చేసి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో భాజపా, వైకాపా పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.