Tuesday, 3 November 2026

హామీలన్ని వరదల్లో కలిశాయి

3

మోదీవన్నీ నిరర్థక వాగ్ధానాలే

కాశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో సోనియా

 

 

షాంగుస్‌(జమ్మూకశ్మీర్‌)డిసెంబర్‌10 (జనంసాక్షి) : జమ్మూకశ్మీర్‌ రాష్ట్ర ప్రజలకు వరదల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నీటి ముటలుగా మిగిలాయని, ప్రధాని నరేంద్రమోదీ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో డిసెంబర్‌ 14న జరగనున్న నాలుగో దశ ఎన్నికల ప్రచారంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రానికి వచ్చినప్పుడు, అంతకుముందు వరదల సమయంలో రాష్ట్రంలో పర్యటించినప్పుడు ప్రధాని మోదీ లెక్కలేనన్ని హావిూలిచ్చారని, కానీ వాటి అమలు విషయం మాత్రం పట్టించుకోవడం లేదని విరుచుకుపడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని షాంగుస్‌ నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో సోనియా మాట్లాడుతూ.. నిరర్ధక హావిూలతో అభివద్ధి జరగదని, చిత్తశుద్ధితో కష్టపడితేనే అభివద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

‘ఇది రాజకీయాలకు సమయం కాదు. విూ కష్టాలపై స్పందించాల్సిన, విూ సమస్యలను పరిష్కరించాల్సిన సమయమిది. విూకు నీడ, కూడు, గుడ్డ కల్పించి, నిత్యావసరాలను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. కనీవినీ ఎరగని స్థాయిలో వచ్చిన వరదల బారిన పడిన ప్రజలకు కనీస సాంత్వన లభించడం లేదు’ అని మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *