Tuesday, 3 November 2026

ముగిసిన ఐఏఎస్‌, ఐసీఎస్‌ అధికారుల పంపీణి

4

 

హైదరాబాద్‌ డిసెంబర్‌10 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పంపిణీ ప్రక్రియ కసరత్తు దాదాపు ముగిసినట్లు సమాచారం. ఈమేరకు ప్రత్యుష్‌ సిన్హా కమీటి తుది జాబితాను సిధ్దం చేసింది. అక్టోబర్‌ 10న విడుదల చేసిన రెండో జాబితానే కేంద్రం దాదాపు ఖరారు చేసే అవకాశం ఉంది. రెండ్రోజుల్లో ప్రధాని కార్యాలయానికి డీవోపీటీ ఈ దస్త్రాన్ని పంపనుంది. ప్రధాని సంతకంతో దస్త్రం డీవోపీటీకి తిరిగి రానుంది. అనంతరం ఐదు రోజుల్లో కేంద్రం అధికారిక జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అధికారులు తమ అభ్యంతరాలు వెలిబుచ్చేందుకు కమిటీ నెల రోజుల సమయం ఇచ్చింది. అధికారులు తాము కోరుకున్న రాష్గాలకు వెళ్లే అవకాశం లేకుంటే పరస్పర మార్పిడి అయ్యే అంగీకారం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *