హావిూలను విస్మరించిన ప్రధాని మోడీ
నేడయినా కనీసం నిజాలు మాట్లాడాలి: కాల్వ
అమరావతి,ఆగస్ట్14(జనం సాక్షి): దేశ ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ మంత్రి కాలువ శ్రీనివాసులు విమర్శించారు. ఎపికి సంబంధించి విభజన హావిూలను పూర్తిగా విస్మరించారని అన్నారు. మంగళవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం రోజైనా మోదీ నిజాలు మాట్లాడాలని అన్నారు. మోదీ పాలనలో దేశం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి విమర్శించారు. ఆర్ధిక నేరస్తులు విదేశాలకు పారిపోతున్నా పట్టించుకోవడం లేదని, విజయసాయిరెడ్డి లాంటివాళ్ళకు పీఎంవోలో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. విదేశాల నుంచి బ్లాక్‌మనీ తెస్తామన్న హావిూ ఏమైందని మంత్రి నిలదీశారు. పేల ఖాతాల్లో 15 లక్షలు వేస్తామని ఇచ్చిన హావిూని కూడా మరచారని అన్నారు. చార అర్భాటం కోసం నాలుగేళ్ళలో మోదీ ప్రభుత్వం రూ. 4,343 కోట్లు ఖర్చు చేసిందని కాలువ శ్రీనివాసులు ఆరోపించారు. ఎపికి సంబంధించినంత వరకు విబజన హావిూలు, ప్రత్యేక¬దా ఇచ్చి తీరాల్సిందే అన్నారు. ఇంకా ఎంతోకాలం దీనిపై నాన్చివేత లేదా దాటవేత ధోరణి సరికాదన్నారు.