Wednesday, 4 November 2026

హిండెన్‌బ‌ర్గ్‌పై ఈడీ దాడులు చేయిస్తారా?: మంత్రి కేటీఆర్‌హిండెన్‌బ‌ర్గ్‌పై ఈడీ దాడులు చేయిస్తారా?: మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: ఇండియాలోని బీబీసీ ఆఫీసుల‌పై ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ఆ దాడుల ప‌ట్ల ఆయ‌న ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేశారు. కొన్ని వారాల క్రిత‌మే ప్ర‌ధాని మోదీపై బీబీసీలో డాక్యుమెంట‌రీ ప్ర‌సారం అయ్యింద‌ని, ఇప్పుడు భార‌త్‌లోని బీబీసీ ఆఫీసుల‌పై ఐటీ దాడులు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. ఐటీ, సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలు న‌వ్వులపాలు అవుతున్నాయ‌ని, ఆ సంస్థ‌లు బీజేపీ కీలుబొమ్మ‌లుగా మారిన‌ట్లు కేటీఆర్ విమర్శించారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌శ్నించిన మంత్రి కేటీఆర్‌.. త‌ర్వాత ఎటువంటి చ‌ర్య‌ను తీసుకుంటార‌ని అడిగారు. అదానీ స్టాక్స్‌పై నివేదిక ఇచ్చిన హిండెన్‌బ‌ర్గ్ సంస్థ‌పై ఐటీ దాడి చేయిస్తారా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. లేదంటే ఆ సంస్థ‌నే టేకోవ‌ర్ చేసుకుంటారా అని ఆయ‌న విమ‌ర్శించారు.బీబీసీపై ఐటీ రెయిడ్స్‌కు సంబంధించి వివిధ మీడియా సంస్థ‌లు రాసిన క‌థ‌నాల‌ను త‌న ట్వీట్‌లో మంత్రి ట్యాగ్ చేశారు.