హిందూ, ముస్లిం చిహ్నాలతో ఆకట్టుకుంటున్న ఆవు

లక్నో: శరీరంపై హిందూ, ముస్లిం చిహ్నాలతో ఉన్న ఓ ఆవు విశేషంగా ఆకట్టుకుంటున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లోని నాబాద్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఆవు ఒంటిపై ఒక వైపు ‘అల్లాహో’, అని ఉర్దూ అక్షరాలతో తెల్లని చార ఉండగా, మరోవైపు హిందూ దేవుని గుర్తు ఉంది. దీంతో చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో ఆవును చూసేందుకు తరలివస్తున్నారు.