హైదరాబాద్ : నగరంలోని హుక్కా సెంటర్లపై పోలీసులు చేసిన మెరుపు దాడిలో పలువురు మైనర్లు పట్టుబడ్డారు. పదవ తరగతి రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో మైనర్లు హుక్కా సెంటర్లకు వెళ్ళినట్లు చాంద్రాయణగుట్ట పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసలు హుక్కా సెంటర్లపై దాడి చేశారు. 28 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ల నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పట్టుబడిన 28 మందిలో ఆరుగురు మైనర్లు ఉన్నారు. మైనర్ల తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు వారి ఎదుట మైనర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ రైడ్‌లో చాంద్రాయణగుట్ట అడిషనల్ ఇన్‌స్పెక్టర్ శంకర్, ఎస్‌ఐ చంద్రమోహన్ తదితరులు ఉన్నారు.
హుక్కా సెంటర్లపై పోలీసుల దాడులు….




