హైదరాబాద్: హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వీసీ కార్యాలయాన్ని విద్యార్థులు చుట్టుముట్టి ఆందోళన చెపట్టారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను నచ్చజొప్పే ప్రయత్నం చేశారు. అయినా విద్యార్థులు వినకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో విద్యార్థులు పోలీసులపై ఎదురుదాడికి దిగి వారిపై రాళ్లురువ్వారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
మీడియా ప్రతినిధుల ఆందోళన
హెచ్‌సీయూలో విద్యార్థులు తమపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. మీడియా సమావేశం కోసం వచ్చిన తమపై దాడికి పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు.




