నిర్వాసితులను పట్టించుకోవడం లేదు
ఏలూరు,జూన్4(జనం సాక్షి): ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాంక్రీట్ పనులు ప్రాంభం కావడంతో నిత్యం చురకుగా పనులు సాగుతున్నాయి. అయితే నిర్వాసితుల ఆందోళనలను కూడా కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించాలని పోలవరం నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 50 రోజులు దాటినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిర్వాసితుల ఆందోళనకు సిపిఎం సంఘీభావం తెలిపింది. ప్రాజెక్టు కోసం సర్వత్యాగం చేస్తున్న నిర్వాసితులే దేవుళ్లు అంటున్న చంద్రబాబుకు ఇక్కడ దీక్షలు చేస్తున్న నిర్వాసితులు కన్పించలేదా అని ప్రశ్నించారు. పరిహారం, పునరావాసం, భూమికి భూమి ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉందన్నారు.