హైకోర్టు పరిసరాల్లో మరో రెండు నెలల పాటు నిషేధాజ్ఞలు పొడిగిస్తూ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మే 6వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ అగస్టు 4వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. హైకోర్టు, పరిసరాల్లో ఉన్న సిటీ కాలేజ్, మదీనా, నయాపూల్, ఝాన్సీబజార్, పత్తర్‌ఘాట్, ముస్లింజంగ్ బ్రిడ్జి, పురానాపూల్, పీటీవో, మూసాబౌలి, మెహిందీ, తదితర పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. హైకోర్టు, పరిసరాల్లో శాంతిభద్రత పరిరక్షణ నేపథ్యంలో నిషేదాజ్ఞలు విధించినట్లు కమిషనర్ తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, బహిరంగ సభలు, సభలు, పికెటింగ్ వంటి కార్యాక్రమాలు నిర్వహించరాదన్నారు.మత పరమైన కార్యక్రమాలు ఉంటే డీసీపీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొని అనుమతి తీసుకోవాలన్నారు.
హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు




