హైదరాబాద్, మార్చి 18: హైకోర్టు విభజనపై తెలంగాణ ఉభయసభల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టగా.. మండలిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానంపై విపక్షాలు పలు సూచనలు చేశాయి. దీన్ని స్వీకరించిన సీఎం కేసీఆర్.. విపక్షాల సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.




