హైదరాబాద్, సెప్టెంబర్5: ప.గో జిల్లాలోని సైకో దాడులు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌కు పాకాయి. శనివారం ఉదయం మల్కాజ్‌గిరిలో 4వ తరగతి విద్యార్థిని రమ్యకు గుర్తుతెలియని వ్యక్తి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పరారయ్యాడు. రమ్య స్కూల్‌కు వెళ్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఓ దుండగుడు ఇంజక్షన్ ఇచ్చి పరారయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిన రమ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానిక మోడల్ స్కూల్‌లో రమ్య 4వ తరగతి చదువుతోంది. ఈ ఘటన తో అప్రమత్తమైన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు
హైదరాబాద్‌కు పాకిన ఇంజక్షన్ దాడులు




