యాసిడ్‌దాడికి గురైన జరీనాబేగం మృతి
తిరుపతి, సెప్టెంబర్5: భర్త చేతిలో యాసిడ్‌దాడికి గురైన జరీనాబేగం తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది. జులై 15న ఆమె భర్త చేతిలో దాడికి గురయ్యింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్సపొందుతూ మృతి చెందింది. 45 రోజులపాటు మృత్యువుతో పోరాడిన జరీనాబేగం చివరకు మృత్యువును జయించలేక ఓడిపోయింది. జరీనాబేగం మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్నారు.