Tuesday, 3 November 2026

హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులు ఇవ్వండి

C

– కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చండి

– వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న హైదరాబాద్‌ అభివృద్దికి ప్రత్యేకంగా నిధుల ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. గురువారం ఆయన కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పనకు ఆర్థికసాయం చేయాలన్నారు. ఆకర్షణీయ నగరాల్లో భాగంగా హైదరాబాద్‌కు ఏడాదికి కేవలం రూ.100 కోట్లు ఇస్తే కానీ సరైన సదుపాయాల కల్పన సాధ్యం కాదన్నారు. రూ.5,500కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన జీహెచ్‌ఎంసీకి ఏడాదికి రూ.వంద కోట్లు ఇస్తే ఏ పనులూ చేపట్టలేమంటూ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రవాణా తదితర మౌలిక రంగాల కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు పరచుకోవాల్సి ఉందన్నారు. హైదరాబాద్‌ స్థానంలో ఆకర్షణీయ నగరంగా కరీంనగర్‌ను ఎంపిక చేయాలన్నారు. ఇందువల్ల కరీంనగర్‌లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి సాధ్యమవుతుందంటూ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు గురువారం లేఖ రాశారు. కేంద్రం ప్రకటించిన స్మార్ట్‌ సిటీల జాబితాలో హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్ను చేర్చాలని లేఖలో కేసీఆర్‌ కోరారు. స్మార్ట్‌ సిటీ పథకం కింద హైదరాబాద్‌కు కేవలం 100 కోట్లను కెటాయించడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదని కేసీఆర్‌ పేర్కొన్నారు. అందువల్ల హైదరాబాద్‌ స్థానంలో కరీంనగర్‌ను  ఈ జాబితాలో చేర్చి, హైదరాబాద్‌కు విడిగా నిధులు మంజూరు చేయాలని వెంకయ్యనాయుడుని కేసీఆర్‌ కోరారు. హైదరాబాద్‌ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం ఆర్థికసాయం అందజేయాలని లేఖలో కోరారు. స్మార్ట్‌ సిటీ పథకంలో చేర్చిన హైదరాబాద్‌లో కేవలం రూ.100 కోట్లతో సరైన సదుపాయాలు కల్పించడం సాధ్యంకాదని తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రత్యేకంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. 625 కిలో విూటర్ల పరిధిలో విస్తరించి హైదరాబాద్‌ ఏ-1 కేటగిరిలో ఉందన్నారు. హైదరాబాద్‌ స్థానంలో స్మార్ట్‌ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేయాలని తెలిపారు. దీంతో కరీంనగర్‌లో ప్రణాళికాబద్దంగా అభివృద్ధి సాధ్యమవుతోందని వివరించారు. హైదరాబాద్‌ మహా నగర మంచినీటి సరఫరా, డ్రైనేజీ, రవాణా తదితర మౌలిక రంగాల కోసం ప్రత్యేక వ్యూహాన్ని అమలు పరచాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *