Wednesday, 4 November 2026

హైదరాబాద్‌లోని ఆంధ్రులు.. హైదరాబాద్‌లోని ఆంధ్రులు..  బాబు మాటలను నమ్మొద్దు

– నమ్మి ఓటేస్తే మరో యాబైఏళ్లు వెనక్కి వెళ్తాం
– కేసీఆర్‌ సీఎం అయితేనే మనకు మంచి జరుగుతుంది
– నాఓటు కేసీఆర్‌కే వేస్తా
– సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ
హైదరాబాద్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని ఆంధ్రులు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని, నాలుగేళ్ల తెరాస పాలనలో ఆంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్‌ చూసుకున్నారని సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస జూబ్లిహిల్స్‌ అభ్యర్థి మాగంటి గోపినాథ్‌ ఎల్లారెడ్డి గూడలోని పోసాని నివాసానికి వెళ్లారు. తెరాసకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. నా ఓటు తెరాసకే వేస్తానని హావిూ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్‌ అధికారంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణలోని ఆంధ్రులంతా తెరాసకు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ వాసులను మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని వ్యాఖ్యానించారు.  దేశంలో చంద్రబాబు లాంటి మోసగాడు మరొకరు లేరని అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరని….నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని పోసాని తెలిపారు. కేసీఆర్‌ దేశంలోనే ఉత్తమ సీఎంలలో ఒకరని పోసాని కృష్ణ మురళి కొనియాడారు. తెజస అధినేత కోదండరాం అంటే తనకు ఎంతో గౌరవమని, అయితే ఆధారాలతో విమర్శలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.