Tuesday, 3 November 2026

హైదరాబాద్‌లో అకాల వర్షం, స్తంభించిన ట్రాఫిక్‌

zbspcblaహైదరాబాద్‌, మార్చి 30 : హైదరాబాద్‌లో పలుచోట్ల సోమవారం అకాల వర్షం కురిసింది. నిన్న, మొన్న ఎండలతో వేడెక్కిన నగరం ఈరోజు కురిసిన వర్షంతో ఒక్కసారిగా చల్లబడింది. చాలా చోట్ల భారీ వర్షం పడడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి, ట్రాఫిక్‌ స్తంభించింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, బంజారాహిల్స్‌, టోలిచౌక్‌, రాజేంద్రనగర్‌లలో భారీగా వర్షం కురిసింది. మరికొన్ని ప్రాంతాల్లో నాలాలు పొంగి వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *