Friday, 6 November 2026

హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌లో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని పాత బస్తీలోని మీర్‌ఆలం ప్రింటర్స్‌ వద్ద భారీ వాహనాల పార్కింగ్‌ చేసే ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదు బస్సులు, రెండు లారీలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.