– ఐటీ అభివృద్ధితో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి
– సైబరాబాద్‌ను అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా?
– ఇక్కడున్న స్టేడియాలన్నీ గతంలో నిర్మించినవే
– ఒకప్పుడు పొగిడిన కేసీఆర్, కేటీఆర్‌లు.. ఇప్పుడు విమర్శిస్తున్నారు
– కేసీఆర్‌కు నేనంటే ఎందుకంత భయం?
– ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారు
– బీజేపీ, టీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్‌తో ముందుకెళ్తున్నారు
– మోదీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి
– ప్రశ్నించిన వారిపై.. ఐటీ పేరుతో దాడులు చేయిస్తున్నారు
– రెండు పార్టీలకు ప్రజలు ఐక్యంగా గుణపాఠం చెప్పాలి
– హైదరాబాద్‌లో రోడ్‌షోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
హైదరాబాద్, నవంబర్29(జనంసాక్షి) : హైదరాబాద్, చార్మినార్ కట్టానని తాను ఎప్పుడూ చెప్పలేదని, సైబరాబాద్ నిర్మించానని, తద్వారా హైదరాబాద్‌కు పేరు తీసుకువచ్చానని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. గురువారం చంద్రబాబు శేరిలింగంపల్లిలో రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో ఊహించని అభివృద్ధి చేశామని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తమ కష్టార్జితమని, ఐటీ అభివృద్ధితో లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న స్టేడియాలన్నీ గతంలో నిర్మించినవే చంద్రబాబు పేర్కొన్నారు. తమ హయాంలోనే ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌కు కృష్ణా నీళ్లు తీసుకొచ్చామన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని కేసీఆర్, కేటీఆర్ పొగిడారని, ఇప్పుడు తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మోదీ వస్తే దేశం బాగుపడుతుందని ఆశించామన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి పంచుతామన్నారని , రూపాయి విలువ పడిపోయిందని.. అన్ని ధరలు పెరిగాయని బాబు తెలిపారు. ముస్లింలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. ప్రశ్నించినవారిపై ఐటీ పేరుతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడున్న ప్రాజెక్టులన్నింటినీ తానే మంజూరు చేశానని చంద్రబాబు నాయుడు అన్నారు. అభివృద్ధిని పట్టించుకుని కేసీఆర్.. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్‌లో రోడ్లు వేశారా?, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టారా?.. దళితులకు భూమి ఇచ్చారా?, ఇంటింటికి నీళ్లు ఇచ్చారా అని బాబు ప్రశ్నించారు. ఏపీలో రైతులకు లక్షన్నర రుణమాఫీ చేస్తే ధనిక రాష్ట్రంలో రూ.లక్ష మాత్రమే రుణమాఫీ చేశారని విమర్శించారు. ఏపీలో డ్వాక్రా సంఘాలకు కూడా రుణమాఫీ చేశామని తెలిపారు. అయితే తెలంగాణలో మాత్రం డ్వాక్రా సంఘాలను కేసీఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధికి అనుకూలమైన ప్రాంతమని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులుపాలు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బీజేపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేయగానే గవర్నర్ ఆమోదించారని…అసలు ఎందుకు అసెంబ్లీని రద్దు చేశారో కేసీఆర్ చెప్పలేదన్నారు. గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్ కంపెనీలు ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఏ ఫ్రంట్‌లో ఉంటారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. లాంగ్ వీకెండ్ వచ్చిందని.. వచ్చే ఐదారు రోజులు ఇంటింటికి తిరగాలని అభ్యర్థులకు తెలిపారు. ప్రజాకూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈవీఎంలపై ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రికి నేనంటే ఎందుకంత భయమని, నాకు ఇక్కడ ఏంపని అని అడుగుతున్నారన్నారు. రెండు తెలుగు రాష్టాల్ర కోసం నేను పనిచేస్తానన్నారు. రెండు రాష్టాల్రు బాగుండాలని నేను కోరుకుంటున్నానన్నారు. తెలంగాణను అభివృద్ది చేయడమే నేను చేసిన తప్పా అని అడిగారు. కేసీఆర్ ఇచ్చిన హావిూలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఎందుకు చేయలేదన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తానని ఇవ్వలేదన్నారు. ప్రతి ఇంటికీ నల్లా ఇచ్చిన తర్వాతనే ఓట్లడుగుతానని చెప్పిన కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నన్ను తిడుతున్నారని, ఎందుకు నన్ను తిడుతున్నారని, తెలంగాణను అభివృద్ది చేయడం తప్పా, సైబరాబాద్ ను అభివృద్ది చేయడం నేను చేసిన తప్పా అని చంద్రబాబుకు ఇక్కడేం పని అంటున్నాడు.. నేను అభివృద్ది చేస్తానే తప్ప.. రాష్ట్రానికి మేలు చేస్తానే తప్ప నేను ఎలాంటి నష్టం చేయలేదన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇస్తానన్నాడని, నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్నాడని, మరి నీళ్లిచ్చాడా? ఎలా ఓట్లు అడుగుతాడని కేసీఆర్‌ను ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో అభివృద్ధి తమ కష్టార్జితం




