హైదరాబాద్, ఏప్రిల్ 6 : నగరంలోని సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న డార్జిలింగ్ యువతిపై ఏడుగురు కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డార్జిలింగ్‌కు చెందిన యువతి ఏడాది క్రితం నగరానికి వచ్చిన యువతి హిమాయత్‌నగర్‌లోని తన చిన్నాన్న ఇంట్లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలంగా యువతిని ఓయువకుడు వేధింపులకు గురిచేశాడు.ఈ క్రమంలో నిన్న(ఆదివారం) ఇంట్లోని నుంచి యువతిని తీసుకెళ్లిన యువకుడు తోటి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్ చేసి రాత్రి 10 గంటలకు హిమాయత్‌నగర్‌లో విడిచిపెట్టాడు. అక్కడ కూడా కొంతమంది వెంటపడటంతో స్థానికులు యువతిని రక్షించారు. ప్రస్తుతం బాధితురాలు కోఠి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.




