– అర్థరాత్రివేళ దాడులు చేసుకున్న ఇరువర్గాలు
– పోలీసుల సమక్షంలోనే బెదిరింపులు
– టీఆర్‌ఎస్ నేత అరుణ్ పై కేసునమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్, మే4(జనంసాక్షి) : హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి అయితేచాలు హడలిపోవాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి యువకులు హల్‌చల్ చేస్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో రెచ్చిపోతున్నారు. రెండు రోజుల క్రితం కాలాపత్తర్‌లో యువకుల దాడుల ఘటన మరువక ముందే.. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని రెహమత్‌నగర్‌లో లోకల్ లీడర్ అనుచరగనం రెచ్చిపోయింది. అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉమాకాంత్ అనే యువకుడు సమస్తే పెట్టకపోవడంతో ఊగిపోయిన స్థానిక టీఆర్‌ఎస్ లీడర్ అరుణ్… ఉమాకాంత్‌ను తీవ్రంగా మందలించాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఉమాకాంత్‌కు చెందిన బైక్‌ను టీఆర్‌ఎస్ లోకల్ లీడర్ అరుణ్, అతడి అనుచరులు తగలబెట్టారు. బైక్ తగలబెట్టి బెదిరింపులకు పాల్పడిన స్థానిక టీఆర్‌ఎస్ నేత అరుణ్‌పై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఉమాకాంత్‌ను పోలీసుల సమక్షంలోనే బెదిరించారు అరుణ్ అనుచరులు.. దీంతో అరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నమస్తే పెట్టకపోవడం, మర్యాద ఇవ్వకపోవడంతోనే నాపై అరుణ్ కక్ష్య కట్టాడని ఉమాశంకర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే రాత్రి ఇంటి వద్ద నన్ను చంపేందుకు అరుణ్, అతని అనుచరులు యత్నించారని, నాపై పెట్రోల్ పోయడంతో తప్పించుకునేందుకు పారిపోయానని పోలీసులకు వివరించారు. దీంతో నాబైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించారని వెల్లడించారు. నాకు ప్రాణహాణి ఉందని, మాది పేద కుటుంబమని, నాకు న్యాయం చేయండి అని ఉమాశంకర్ పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.
హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్..!




