హైదరాబాద్ జనంసాక్షి : హైదరాబాద్‌లో పోలీసులు రెండు చోట్ల కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. తూర్పు మండలం సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో 250 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 11వేల నాటుసారా ప్యాకెట్లు, 136 గ్యాస్ సిలెండర్లు, అక్రమంగా గ్యాస్ నింపే మిషన్లు స్వాధీనం చేసుకుని 18మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పరిధిలోని కార్మికనగర్‌లోనూ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారిలో కొందరు చోరీలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించిన పోలీసులు…. 24 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, 2,300 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. 33 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో 8మంది /ొడీషీటర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తూర్పు మండల డీసీపీ శ్రీధర్, పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు తనిఖీల్లో పాల్గొన్నారు.




