హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్,సెప్టెంబర్26(జనంసాక్షి): జంటనగరాల్లో బుధవారం ఉదయం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దాదాపు అరగంటకు పైగా జోరువాన కురియడంతో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కోఠి, అబిడ్స్, నాంపల్లి, లక్డీకపూల్, బషీర్‌బాగ్, సికింద్రాబాద్, ముషీరాబాద్, యూసుఫ్‌గూడ, తార్నాక, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, ఓయూ, విద్యానగర్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, నాంపల్లి, అప్జల్‌గంజ్, లిబర్టీ, ఆర్టీసీక్రాస్‌రోడ్, దిల్సుఖ్నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హిమాయత్‌నగర్, రాజేంద్రనగర్, బుద్వేల్, అత్తాపూర్, కిస్మత్పూర్, మైలార్‌దేవ్‌పల్లి తదితర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. నీటినిల్వను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. సమస్యలుంటే ఫోన్ చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ దానకిశోర్ వెల్లడించారు. అకస్మాత్తుగా వర్షం రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్డుపై వర్షపు నీరు వచ్చిచేరడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో 3.6కి.విూ ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది.