Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ చేరుకున్న అఖిలేశ్‌ యాదవ్‌

పుష్పగుచ్చాలతో స్వాగతం పలికిన కేటీఆర్‌, తలసాని
హైదరాబాద్‌,మే2( జ‌నం సాక్షి): యూపీ మాజీ ముఖ్యమంత్రి,సమాజ్‌వాది పార్టీ అధినేత  అఖిలేశ్‌ యాదవ్‌ హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీలు శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డిలు ఘన స్వాగతం పలికారు. అఖిలేశ్‌కు స్వాగతం పలికేందుకు నగరానికి చెందిన యాదవులు వేలాదిగా బేంగంపేట చేరుకుని నినాదాలు చేశారు. అఖిలేశ్‌ జిందాబాద్‌ అంటూ నినదించారు. అనంతరం అఖిలేశ్‌ తలసాని ఇంటిలో తేనీటి విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి తలసాని ఇంటి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.  తేనీటి విందు అనంతరం అఖిలేశ్‌ ప్రగతిభవన్‌కు చేరుకొని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ కానున్నారు. తాజా రాజకీయాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. దేశంలో గుణాత్మక మార్పు లక్ష్యమని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌తో కేసీఆర్‌ చర్చలు జరిపారు.
——————————————-