Tuesday, 3 November 2026

హైదరాబాద్‌ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ నరసింహన్ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర మంత్రులతో పాటు బిజెపి నేతలను ప్రధాని పలకరించారు. ఈ కార్యక్రమం తరువాత ప్రధాని మోడీ పదిహేను నిమిషాల పాటు బిజెపి నేతలతో భేటీ కానున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో మియాపూర్ వెళ్లనున్నారు ప్రధాని. అక్కడ మెట్రో పైలాన్‌ను ప్రారంభించి, మెట్రోరైలులో ప్రధాని ప్రయాణించనున్నారు.